ప్రైవేట్ డ్రైవర్లకు ఏపీ సర్కార్ ఖుష్ కబర్
NEWS Sep 14,2025 07:55 am
ఆటో మిత్ర పథకం అమలుకు ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు, మోటార్ క్యాబ్ డ్రైవర్లు, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లలకు ఏడాదికి రూ.15 వేలు ఆటో మిత్ర పథకం కింద ఇవ్వాలని నిర్ణయించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి విధివి ధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు రవాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. టి. కృష్ణబాబు.