తెలంగాణలో పిక్సిమమ్ రూ.200 కోట్ల పెట్టుబడి
NEWS Sep 14,2025 07:45 am
తెలంగాణలో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది పిక్సిమమ్ కంపెనీ. LED మానుఫ్యాక్చురింగ్ రంగంలో పిక్సియమ్ టాప్ లో కొనసాగుతోంది. డిస్‌ప్లే టెక్నాలజీస్ LEDలు, మైక్రో LEDలు, ఆడియో వీడియో కాంపోనెంట్స్ తయారు చేస్తుంది. మొదటి దశలో రూ.200-250 కోట్లతో పెట్టుబడులు పెట్టనుంది. దీని ద్వారా 100కి పైగా ప్రత్యక్షంగా, దాదాపు 5 వేల మందికి పైగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రెండో దశలో రూ. 100 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.