క్రీడల్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
NEWS Sep 14,2025 12:14 am
మెట్ పల్లి: వెల్లుల గ్రామంలో జరుగుతున్న ఎస్టీఎఫ్ మండల స్థాయి క్రీడల్లో మెట్ పల్లి గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. కబడ్డీ అండర్-14, అండర్-17 విభాగాల్లో మొదటి స్థానం సాధించగా, అథ్లెటిక్స్ విభాగంలో 4 బంగారు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా వీరిని ప్రిన్సిపల్ జుబేర్, ఏటీపీ సరిత, పీఈటి ప్రశాంత్ అభినందించారు.