ఘనంగా ఆర్యవైశ్య ఉపాధ్యాయ ఉత్సవ్
NEWS Sep 14,2025 12:11 am
జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య ఉపాధ్యాయ ఉత్సవ్ కార్యక్రమం మల్యాల మండలం ఎక్సరోడ్డు వద్ద ఓ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర ఆర్య వైశ్య చైర్ పర్సన్ కల్వ సుజాత 200 మంది ఉపాధ్యా యులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.