15న మండల కార్యాలయాల ముట్టడి
NEWS Sep 14,2025 10:58 am
జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామంలో ఎంఆర్పీఎస్ నాయకులు వృద్ధులు, వితంతులు, బీడీ కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దుమాల గంగారం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్లు పెంచుతానని హామీ ఇచ్చి ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. ఈనెల 15న జరగనున్న మండల కార్యాలయాల ముట్టడిని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో మండల ఇన్‌చార్జి కిషన్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.