'రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి'
NEWS Sep 14,2025 12:10 am
జగిత్యాల జిల్లా BRS పార్టీ కార్యాలయంలో మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత మీడియా సమావేశం నిర్వహిచారు. వసంత మాట్లాడుతూ.. రాజ్యాంగం పట్టుకొని ప్రజాస్వామ్యం అంటూ రాహుల్ గాంధీ దేశంలో తిరగడం కాదని, తెలంగాణలో తిరగాలని అన్నారు. KTR MLAల చోరి అంటూ (X)లో పెట్టిన పోస్ట్ పై రాహుల్ సమాధానం చెప్పాలన్నారు. అభివృద్ధి ముసుగులో ఫిరాయింపులకు దారి తెరిచారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.