శాంతి భద్రతలకు విఘాతం.. పీడీ యాక్ట్ కేసు
NEWS Sep 14,2025 12:09 am
జగిత్యాల: శాంతి భద్రతలకు భంగం కలిగించిన వ్యక్తిపై పిడి యాక్ట్ నమోదు చేసినట్లు జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జగిత్యాల విద్యానగర్ కు చెందిన బండి తరాల శ్రీకాంత్ పై పలుమార్లు కేసులు నమోదైనా, అతని ప్రవర్తనలో మార్పు రాలేదని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో, అతనిపై పిడి యాక్ట్ నమోదు చేసి కరీంనగర్ జైలులో ఉంచి, చర్లపల్లి జైలుకు తరలించినట్లు ఎస్పీ చెప్పారు.