లోక్ అదాలత్: 270 కేసులు కొట్టివేత
NEWS Sep 14,2025 12:07 am
లోక్ అదాలత్ ల ద్వారా రాజీ పొందే కక్షిదారులకు సత్వర న్యాయం అందడంతో పాటు, అప్పీల్ ఉండకపోవడం, కట్టిన కోర్టు ఫీజు వాపస్ రావడం లాంటి ఎన్నో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని జూనియర్ సివిల్ జడ్జి నారం అరుణ్ కుమార్ అన్నారు. శనివారం నాటి లోక్ అదాలత్ లో మొత్తం 270 కేసులు తీసివేసినట్టు ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు. ప్రతి 4 నెలలకి ఒకసారి నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ లను కక్షిదారులు ఉపయోగించుకోవచ్చని ఈ సందర్బంగా ఆయన సూచించారు.