ఎంపీ అరెస్ట్ అక్రమం : బైరెడ్డి
NEWS Sep 13,2025 06:22 pm
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే అక్రమ అరెస్టులు ఉంటాయని తెలుసన్నారు మాజీ ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ మాకు ఆశ్చర్యం కలిగించే విషయం కాదన్నారు. మిథున్ రెడ్డిని మానసికంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. నకిలీ మద్యం సేవించి వేలాది మంది చని పోయారని పుకార్లు పుట్టించారని మండిపడ్డారు. నకిలీ మద్యం కేసులో ఇప్పటి వరకూ ఎవరినైనా అరెస్ట్ చేశారా అని ప్రశ్నించారు.