హెచ్ఎం, వార్డెన్ పై ఎమ్మెల్యే ఆగ్రహం
NEWS Sep 13,2025 06:23 pm
మీ పిల్లలు అయితే ఇలానే ప్రవర్తిస్తారా , ప్రభుత్వ ఉద్యోగులుగా కనీస బాధ్యత లేదా అంటూ ఐలాపురం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వార్డెన్ హెచ్ఎంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పినపాక మండలం ఐలాపురం ఆశ్రమ పాఠశాలలో భోజనాన్ని స్వయంగా తిన్నారు. వంటలు రుచిగా లేకపోవడంతో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మధ్యాహ్నం రెండు గంటలు అయినా విద్యార్థులకు భోజనం వడ్డించరా అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఏమైనా జరిగితే పరిస్థితి ఏమిటన్నారు.