రాజీమార్గమే రాజమార్గం: మెజిస్ట్రేట్ సూరి రెడ్డి
NEWS Sep 13,2025 06:23 pm
రాజీమార్గం రాజమార్గం అని జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమంలో మణుగూరు మేజిస్ట్రేట్ కంభపు సూరి రెడ్డి అన్నారు. శనివారం మణుగూరు కోర్టు ఆయన మాట్లాడుతూ రాజీ పడదగిన కేసుల్లో రాజీ చేసుకొని వారి యొక్క సమయాన్ని కుటుంబ అభివృద్ధికై సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చెక్కు కేసుల్లో కూడా వాది, ప్రతివాదులు ఇరువురు కలిసి రాజీ చేసుకోవాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బద్దం శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లావణ్య, డీఎస్పీ రవీందర్ రెడ్డి, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అంకం. సర్వేశ్వరరావు, లోక్ అదాలత్ మెంబర్ కె వీర మధుసూదన్, లీగల్ ఎయిడ్ మెంబర్ పోశం భాస్కర్ , న్యాయవాదులు పాల్గొన్నారు.