వరద నీటిని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్
NEWS Sep 13,2025 06:24 pm
మణుగూరు సురక్ష బస్ స్టాండ్ రైల్వే బ్రిడ్జి సమీపంలో భారీగా వరద నీరు చేరింది . వెంటనే అప్రమత్తమైన మణుగూరు మున్సిపాలిటీ కమిషనర్ ప్రసాద్ శనివారం సాయంత్రం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. రోడ్లపై నీరు నిలవకుండా ఉండేందుకు తగిన చర్యలు చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లను చేస్తామని తెలియజేశారు. తక్షణమే సిబ్బంది సహకారంతో నీటిని డ్రైనేజీ ద్వారా క్లీన్ చేసే పనులు చేపడతామని తెలిపారు.