ఏపీలో 14 జిల్లాలకు ఎస్పీల నియామకం
NEWS Sep 13,2025 05:45 pm
ఏపీ సర్కార్ 14 జిల్లాలకు ఎస్పీలను నియమించంది. 7 జిల్లాలకు ఎస్పీలుగా కొత్త వారిని, మరో ఏడు జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేసింది. 12 జిల్లాలలో ఉన్న వారినే ఎస్పీలుగా కొనసాగించింది. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశంలో ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా అందించిన సమాచారం మేరకు వీరిని బదిలీ చేశారు సీఎం. కోనసీమకు రాహుల్ మీనా, బాపట్లకు ఉమా, నెల్లూరుకు అజితా, తిరుపతికి సుబ్బా రాయుడు, అన్నమయ్యకు ధీరజ్, కడపకు నచికేత్, నంద్యాలకు సునీల్ , విజయ నగరంకు దామోదర్, కృష్ణాకు విద్యా సాగర్, గుంటూరుకు వకుల్, పల్నాడుకు కృష్ణారావు, ప్రకాశంకు హర్షవర్దన్ , చిత్తూరుకు తుషార్ , శ్రీ సత్య సాయికి సతీష్ కుమార్ లను నియమించారు.