జమాత్-ఎ-ఇస్లామీ హింద్ సేవా కార్యక్రమాలు
NEWS Sep 13,2025 06:27 pm
జమాత్-ఎ-ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. నెల పాటు జరగబోయే ప్రవక్త జన్మదినోత్సవ ఉత్సవాలలో భాగమని నిర్వాహకులు తెలిపారు. జమాతే ఇస్లామీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు అబ్దుల్ హై జావీద్ మాట్లాడుతూ ప్రవక్త మహ్మద్ సమస్త మానవ జాతికి కరుణగా పంపబడ్డారని తెలిపారు. ఆయన జీవితం దయ, న్యాయం, సత్యం, మానవతా సేవలతో నిండి ఉందన్నారు. ఈ రోజు సమాజానికి నిజమైన అవసరం ప్రవక్త అని చెప్పారు. ఆయన బోధనలు అనుసరించాలని, సమాజానికి మేలు చేస్తాయన్నారు.