సురక్ష బస్టాండ్ సమీపంలో రోడ్డు మీదికి చేరిన వరద
NEWS Sep 13,2025 05:46 pm
మణుగూరు లో కురుస్తున్న భారీ వర్షానికి సురక్ష బస్టాండ్ సమీపంలో రోడ్డు మీదకు వరద నీరు చేరింది. శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో కిలోమీటర్ వరకు ట్రాఫిక్ జాం ఏర్పడింది. ప్రధాన రహదారిపై వరద చేరడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి తక్షణమే ట్రాఫిక్ క్లియర్ చేయాలని, అలాగే వరద నీరు చేరకుండా డ్రైనేజీలు శుభ్రం చేయాలని పలువురు కోరుతున్నారు.