వైభవంగా వైష్ణ వానం శ్రీ కృష్ణ జయంతి వేడుకలు
NEWS Sep 13,2025 06:28 pm
పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్‌లో ఈ రోజు వైష్ణవానం శ్రీకృష్ణ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యా సంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ కొబ్బరికాయ కొట్టి శ్రీ కృష్ణుని పూజించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రైమరీ చిన్నారులు కృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలో పాల్గొని వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారి అందమైన అలంకరణ, సాంస్కృతిక ప్రదర్శనలు సందర్శకుల్ని ఆకట్టుకున్నాయి. వేడుకలలో భాగంగా నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమం ఉత్సాహ పూర్వకంగా సందడిగా సాగింది. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.