అక్రమంగా ఇసుక తోలుతున్న లారీ , జెసిబి స్వాధీనం
NEWS Sep 13,2025 06:32 pm
ఆశ్వాపురం మండలం జగ్గారం గ్రామంలో అక్రమంగా ఇసుకను స్టాక్ ఏర్పాటు చేసి అందులో నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న జెసిబి లారీపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక సిఐ అశోక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం అశ్వాపురం నుండి ఇల్లందుకు తరలిస్తున్న ఇసుక లారీ దానికి సహాయ పడిన జెసిబి ని సీజ్ చేయడం జరిగిందన్నారు. ఈ కేసులో మంచి కంటి నగర్ కు చెందిన ఊకే సతీషు, ఇల్లందుకు చెందిన లారీ డ్రైవర్ భూక్య జానీ, జెసిబి ఓనర్ పరుచూరి రాకేష్ లపై కేసు నమోదు చేశామన్నారు.