పంచాయతీ భవనాలు త్వరగా పూర్తి చేయాలి : కలెక్టర్
NEWS Sep 13,2025 06:33 pm
గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. జగిత్యాల కలెక్టరేట్ లో పంచాయతీ భవనాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, భవిత సెంటర్లు, పాఠశాలల్లో గల కిచెన్ షెడ్, సౌచాలయాల నిర్మాణాలపై పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పనులను క్షేత్ర స్థాయిలో పర్య వేక్షించాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్లు తదితరులున్నారు.