సీఎం సహాయనిధి చెక్కులు అందజేత
NEWS Sep 13,2025 07:00 pm
జగిత్యాల: ముఖ్యమంత్రి సహాయనిధి బడుగు బలహీనవర్గాల పేదలకు వరంగా ఉందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల నియోజకవర్గానికి చెందిన పది మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.3లక్షల 90వేల విలువగల చెక్కులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్య క్రమంలో నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు