దమ్ముంటే ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి
NEWS Sep 13,2025 01:36 pm
ఫిరాయింపునకు పాల్పడిన ఎమ్మెల్యేలు దమ్ము, ధైర్యముంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేయక పోవడం దుర్మార్గం అన్నారు. సొంత ప్రయోజనాల కోసమే ఎమ్మెల్యేలు రంగులు మారుస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ లో ఉన్నామని చెప్పుకునే ఎమ్మెల్యేలు ఎందుకు పార్టీ కార్యక్రమాలకు హాజరు కారో చెప్పాలన్నారు.