ఏపీలో బార్ల లైసెన్స్ గడువు పెంపు
NEWS Sep 13,2025 12:50 pm
ఏపీలో మూడోసారి బార్ల లైసెన్స్ గడువు పెంచింది సర్కార్. మరోసారి బార్ల లైసెన్స్ దరఖాస్తులకు ఛాన్స్ ఇచ్చింది. సెప్టెంబర్ 17న సాయంత్రం 6 గంటల వరకు గడువు ఇచ్చింది. 18న లాటరీ విధానంలో లైసెన్సులు మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. ఏపీలో 840 అన్ రిజర్వ్ కేటగిరీలకు కేటాయిస్తామని తెలిపింది. 84 గీత కార్మికులకు బార్ల కేటాయించినట్లు వెల్లడించింది. ఇంకా మిగిలిన 432 బార్లకు రీ-నోటిఫికేషన్ జారీ చేసింది.