హోం మంత్రి అనితపై ఆర్కే రోజా ఫైర్
NEWS Sep 13,2025 12:40 pm
మాజీ మంత్రి ఆర్కే రోజా హోం శాఖ మంత్రి వంగలపూడి అనితపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అబద్దాలు చెప్పడం అలవాటుగా మారారని ఆరోపించారు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడం ఎలా అనే మందును చంద్రబాబు మంత్రులకు ఇస్తున్నారని మండిపడ్డారు. రాజమండ్రి, విజయనగరం, మచిలీపట్నం, నంద్యాల, పాడేరు మెడికల్ కాలేజీలను పరిశీలించడానికి వస్తావా అని అనితకు సవాల్ విసిరారు. మెడికల్ కాలేజీలు ఎలా ఉంటాయో, విద్యార్థులు ఎలా ఉంటారో చూపిస్తానని అన్నారు.