హైదరాబాద్ మెట్రో నడపలేం
NEWS Sep 13,2025 12:35 pm
హైదరాబాద్ మెట్రో నడపడం తమ వల్ల కావడం లేదంటూ చేతులెత్తేసింది ఎల్ అండ్ టి. ఈ మేరకు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవరాహాల శాఖ కార్యదర్శి జైదీప్‌కు లేఖ రాసింది. మెట్రో నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించనున్నట్లు పేర్కొంది. సంస్థకు వరుసగా నష్టాలు వస్తున్నాయని, దీనిని భరించడం చేత కాదని తెలిపింది. పెండింగ్ బకాయిలు, చాలని టికెట్ ఆదాయం, వరుస నష్టాల నేపథ్యంలో ఇక నడప లేమంటూ స్పష్టం చేసింది.