తండ్రికి ఉద్యోగ మిచ్చిన 16 ఏళ్ల కుర్రాడు
NEWS Sep 13,2025 12:02 pm
కేరళకు చెందిన 16 ఏళ్ల కుర్రాడు రాహుల్ జాన్ ఏఐ ఆవిష్కరణలతో సొంత ఏఐ స్టార్టప్ ‘ఆర్మ్ టెక్నాలజీస్’లో తన తండ్రికే ఉద్యోగమిచ్చి వార్తల్లో నిలిచాడు. 6ఏళ్ల వయసులోనే ఏఐ నేర్చుకోవడం ప్రారంభించిన రాహుల్ 16 ఏళ్లు వచ్చేసరికి ‘మీ-బాట్’ అనే రోబోను తయారు చేశాడు. రాహుల్ తన జ్ఞానాన్ని సోషల్ మీడియాలో ఉచితంగా పంచుకుంటున్నాడు. నిజ జీవిత సమస్యలకు పరిష్కారాలు చూపేలా వీడియోలు చేస్తుంటాడు. ఇప్పటికే 10కి పైగా ఏఐ టూల్స్ రూపొందించాడు.