అక్రమ మట్టి తవ్వకాలు ఆపాలని అంధుడి విజ్ఞప్తి
NEWS Sep 13,2025 12:03 pm
పెద్దపల్లి: ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే అక్రమ మట్టి తవ్వకాలను అరికట్టాలని పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన అంధుడు సానికొమ్ము రాంరెడ్డి శుక్రవారం మీడియా ద్వారా అధికారులను కోరాడు. జిల్లాలోని కన్నాల, అందుగులపల్లి, రాఘవాపూర్, కాసులపల్లి, కాచాపూర్, ఎలిగేడు, ర్యాకల్ దేవ్‌పల్లి, కటికెనపల్లి, ధర్మారం, గుళ్లకోట, కదంబాపూర్, కనుకుల, కనగర్తి, కాల్వశ్రీరాంపూర్ ప్రాంతాల్లో అనుమతి లేకుండా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని, టిప్పర్లు–ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయనష్టం జరుగుతోందని రాంరెడ్డి పేర్కొన్నారు.