జనంలోకి టీవీకే చీఫ్ దళపతి విజయ్
NEWS Sep 13,2025 10:34 am
టీవీకే పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు దళపతి విజయ్ శనివారం నుంచి మీట్ ది పీపుల్ పేరుతో జనాన్ని కలిసేందుకు శ్రీకారం చుట్టారు. తమిళనాడులోని తిరుచ్చి నుంచి ప్రారంభించారు. భారీ సభతో ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు మధురై వేదికగా జరిగిన భారీ సభలో. డిసెంబర్ 20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార సభలు చేపడతామని ప్రకటించారు. తిరుచ్చికి చేరుకున్న విజయ్ కు భారీ గా వెల్ కమ్ చెప్పారు పార్టీ నాయకులు, కార్యకర్తలు.