నటి దిశా పటానీ ఇంటి వద్ద కాల్పులు
NEWS Sep 13,2025 09:44 am
బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటి వద్ద కాల్పులు చోటు చేసుకున్నాయి. యూపీలోని బరేలిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దిశా సోదరి ఖుష్బూ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఓ వర్గం మనోభావాలను దెబ్బ తీశాయని, దాని పర్యవసానంగానే ఈ దాడి జరిగి ఉండవచ్చని ప్రాథమిక అంచనా . కాగా ఈ ఘటనలో దిశా కుటుంబం సురక్షితంగా ఉందని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.