బాయ్‌కాట్ ఆసియా కప్ ట్రెండింగ్
NEWS Sep 13,2025 09:36 am
ఆసియా కప్‌లో భాగంగా రేపు భారత్, పాక్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ పహల్గామ్ దాడి ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సమయంలో దాయాది దేశంతో ఎలా మ్యాచ్ ఆడతారంటూ ప్రశ్నిస్తున్నారు భారతీయులు, నెటిజన్లు. ఇందులో భాగంగా నెట్టింట్లో బాయ్ కాట్ ఆసియా కప్ , బాయ్ కాట్ ఇండియా వర్సెస్ పాక్ హ్యాష్ ట్యాగ్ ల పేరుతో హోరెత్తిస్తున్నారు. ఆ జట్టుతో ఆడొద్దంటూ పేర్కొంటున్నారు.