ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం
NEWS Sep 13,2025 04:48 am
కోరుట్ల: మండలం సర్పరాజుపల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పైలట్ ప్రాజెక్టులో భాగంగా శుక్రవారం 3 ఇళ్లు పూర్తి కావడంతో గృహప్రవేశ వేడుకలు జరిగాయి. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు ఈ కార్యక్రమంలో పాల్గొని గృహనిర్మాణ దారులకు నూతన వస్త్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, అభివృద్ధి–సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామకృష్ణ, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.