కాంగో, ఈక్వెటార్ లో పడవ ప్రమాదం 193 మంది మృతి
NEWS Sep 13,2025 08:02 am
కాంగోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రెండు పడవ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 193 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లుకోలెలా వద్ద కాంగో నదిలో 500 మంది ప్రయాణికులతో వెళ్తూ మంటల్లో చిక్కుకుని బోల్తా పడింది పడవ. ఈ ఘటనలో 209 మందిని రక్షించినట్లు పేర్కొన్నారు అధికారులు. మరోవైపు ఈక్వెటార్ ప్రావిన్స్‌లో జరిగిన మరో ప్రమాదంలో 86 మంది మృతి చెందారు.