రాఘవపేట్ గ్రామంలో విద్యుత్ అంతరాయం
NEWS Sep 13,2025 10:10 am
మల్లాపూర్ మండలం రాఘవపేట సబ్‌స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు. మెయింటెనెన్స్ పనుల కారణంగా రాఘవపేట, నడికుడ, హుస్సేన్‌నగర్ గ్రామాల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కరెంట్ నిలిపివేస్తారని వెల్లడించారు. ఈ కారణంగా వినియోగదారులు అసౌకర్యాన్ని సహించాల్సి వస్తుందని, సహకరించాలని అధికారులు కోరారు.