నేడు కోరుట్లలో పవర్ కట్
NEWS Sep 13,2025 10:07 am
కల్లూరు రోడ్ సబ్ స్టేషన్లో మరమ్మతుల నిమిత్తం కోరుట్లలో శనివారం ఉ.9 గంటల నుంచి మ.1 గంట వరకు కరెంట్ ఉండదని ఏఈ తెలిపారు. 11 KV టౌన్-4 ఫీడర్లో చెట్ల కొమ్మల నరికివేత, ఇతర మెయింటెనెన్స్ పనులు వల్ల టీచర్స్ క్లబ్ రోడ్, గంగంపేట, తాళ్ల చెరువు, గడి గురుజు, రథాలపంపు, అంబేడ్కర్ నగర్, శివాజీ రోడ్డు, ఇందిరా రోడ్డు, సుభాష్ రోడ్డు, కటిక వాడలో కరెంట్ ఉండదన్నారు.