వెల్లుల్ల: ముగిసిన విద్యాశాఖ క్రీడలు
NEWS Sep 13,2025 10:03 am
మెట్‌పల్లి: విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్‌జిఎఫ్ గేమ్స్ వెల్లుల్ల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా ముగిశాయి. అండర్-14, అండర్-17 విభాగాలలో బాలబాలికలకు అథ్లెటిక్స్‌తో పాటు కబడ్డీ, కోకో, వాలీబాల్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు మండల విద్యాధికారి చంద్రశేఖర్ మెడల్స్, కప్స్‌ను అందజేశారు. గెలుపొందిన విద్యార్థులు జిల్లా స్థాయిలో జరగబోయే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, నిర్వాహకులు, వ్యాయామ ఉపాధ్యాయులు కొమురయ్య, జ్ఞానేశ్వర్, హరీష్, ఆల్రౌండర్ గంగాధర్, లింబగిరి స్వామి తదితరులు పాల్గొన్నారు.