జగిత్యాలలో విద్యుత్ సరఫరా అంతరాయం
NEWS Sep 12,2025 11:33 pm
జగిత్యాల రూరల్ పరిధిలోని అంతర్గామ, రాజేశం గుట్ట (వాటర్ వర్క్స్) సబ్‌స్టేషన్ల మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని డి.ఇ. గంగారాం తెలిపారు. హస్నాబాద్, లింగంపేట, ఇండస్ట్రియల్ ఫీడర్, అంతర్గామ, అంబరీపేట, ఒడ్డెర కాలనీ, అంతర్గామ ఎక్స్‌పైస్ ఫీడర్లలో కరెంట్ ఉండదని చెప్పారు. రైతులు, వినియోగదారులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.