అడిషనల్ కలెక్టర్ రాజాకు శుభాకాంక్షలు
NEWS Sep 12,2025 11:32 pm
జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీ)గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన రాజాను శుక్రవారం తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో విశేషమైన సేవలు అందిస్తూ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అరుణ్ కుమార్, భూమయ్య తదితరులు పాల్గొన్నారు.