ఇండియా–పాక్ మ్యాచ్ బహిష్కరించాలి
NEWS Sep 12,2025 11:31 pm
ఇబ్రహీంపట్నం: ఆసియా కప్‌లో భాగంగా ఏప్రిల్ 14న దుబాయ్‌లో జరుగుతున్న ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌ను భారతీయులందరూ బహిష్కరించాలని బీసీ విద్యార్థి యువ నాయకుడు కోటి శ్రీనివాస్ కోరారు. భారత సైనికుల ప్రాణాలను బలిగొన్న పాకిస్థాన్‌తో కేంద్ర ప్రభుత్వం, బీసీసీఐ మ్యాచ్‌లు ఆడించడం దారుణమని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు.