పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి
NEWS Sep 12,2025 07:41 pm
ఇంటి పరిసరాలు, కుండీల్లో నీరు నిల్వ ఉండకుండా చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మోహన్ సూచించారు. మెట్పల్లి పట్టణంలోని 20వ వార్డులో డ్రై డే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. కుండీల్లో నిల్వ ఉన్న నీటిని తొలగింప జేశారు. నీరు నిల్వ ఉండడం వల్ల వాటిలో దోమలు వృద్ధి చెంది రోగాలకు కారణమవుతాయన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ విష్ణు, ముజీబ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.