వడ్డాదిలో యూరియా కోసం రైతుల ధర్నా
NEWS Sep 12,2025 07:41 pm
వడ్డాది రైతు భరోసా కేంద్రం వద్ద శుక్రవారం రైతులు యూరియా కొరతపై ధర్నాకు దిగారు. ఎరువులు అందక పంటలు ఎండిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వైస్ ఎంపీపీ దొండ నారాయణ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా యూరియా కొరత ఏర్పడిందన్నారు. రైతులు రోజులు తరబడి క్యూల్లో నిలబడి ఇబ్బంది పడుతున్నారని ఆవేదన చెందారు. అందుతున్న కొద్దిపాటి యూరియా కూడా నాయకులకే చేరుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో ఎంపీటీసీ కోరుకొండ రమణ, రైతు సంఘ నాయకులు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.