గ్రూప్ -1పై నోరెత్తని బీజేపీ : దాసోజు
NEWS Sep 12,2025 07:30 pm
గ్రూప్ 1 అంశంపై, కోర్టు తీర్పుపై ఒక్క బీజేపీ నాయకుడు నోరు మెదపక పోవడం దారుణమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. రేవంత్ రెడ్డిని ఒక్క మాట అనక పోవడంతో బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రంలో ఒక్కటేనని తేలి పోయిందన్నారు. కోర్టు తీర్పుపై స్పందించక పోవడం, బాధితులైన అభ్యర్తులకు అన్యాయం జరిగితే ప్రశ్నించక పోవడం దారుణమన్నారు. మొత్తంగా బీజేపీ ప్రజా ప్రతినిధులు ఎంపీలు, ఎమ్మెల్యేలు సీఎంను రక్షిస్తున్నారని ఆరోపించారు. గతంలో ధర్నా చేసిన బండి ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.