బెంగళూరులో ఫుల్ టైమ్ ఏపీలో పార్ట్ టైమ్
NEWS Sep 12,2025 06:17 pm
ఏపీ మంత్రి వంగలపూడి అనిత మాజీ సీఎం జగన్ రెడ్డిపై భగ్గుమన్నారు. ఆయనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బెంగళూరులో ఫుల్ టైమ్ ఉంటారని, ఏపీలో పార్ట్ టైమ్ గడుపుతారని ఎద్దేవా చేశారు. తనకు కూటమి సర్కార్ ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. బెంగళూరు నుంచి తెచ్చిన బురద జల్లడమే తను పనిగా పెట్టుకున్నాడని మండిపడ్డారు. పీపీపీ మోడల్ అంటే జగన్ ఎందుకు ఉలిక్కి పడుతున్నారంటూ ప్రశ్నించారు.