విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒప్పుకోం
NEWS Sep 12,2025 05:58 pm
మోదీ సర్కార్ లేదు లేదంటూనే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించేందుకు, అదానీకి అప్పగించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. అడ్డుకోవాల్సిన సీఎం చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించారు. జనసేన చీఫ్ నోరున్నా పలకడం లేదని, ఇక జగన్ మోదీకి దత్త పుత్రుడంటూ ఎద్దేవా చేశారు.