ఏపీలో ఎరువుల కొరత లేదు
NEWS Sep 12,2025 05:11 pm
రాష్ట్రంలో ఎరువుల కొరత లేదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. అంచనాలకు మించి నిల్వలు ఉన్నాయని తెలిపారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. కేంద్రం రాష్ట్రానికి మరో 24,894 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించిందని తెలిపారు. 15 తేదీ నుండి 22వ తేదీ లోపు విశాఖపట్నం పోర్టుకు యూరియా చేరుకుంటుందన్నారు. ఈ యూరియా నిల్వలతో కరీఫ్ సీజన్ కు సరిపడా యూరియా అందరికి లభిస్తుందని, ఎక్కడ కూడా యూరయా కొరత అనే మాట వినిపించదన్నారు.