ఎర్రబెల్లి రఘునాథ్ రావుకు గ్రాండ్ వెల్ కమ్
NEWS Sep 12,2025 05:14 pm
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గా నూతనంగా ఎన్నికై మొదటిసారి విచ్చేసిన ఎర్రబెల్లి రఘునాథ రావుకు ఘన స్వాగతం లభించింది. పట్టణ, మండల అధ్యక్షులు పెంజర్ల రాకేష్, వేల్పుల రమేష్ అధ్వర్యంలో పెద్దపల్లి కమాన్ చౌరస్తా వద్ద ఘనంగా ఘజమాలతో స్వాగతం పలికారు. శాలువాతో సన్మానించారు. తను గతంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడుగా పని చేశారు. బీజేపీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.