గ్రంథాలయంపై ఇంత అశ్రద్ధ ఎందుక
NEWS Sep 12,2025 05:15 pm
ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు గ్రంథాలయాల్లో రూపుదిద్దుకుంటుంది. ఈ ఉద్దేశంతోనే ప్రభుత్వాలు మండలాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తాయి. కానీ పినపాక మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని తెరిచే నాధుడే లేడు. ఈ గ్రంథాలయంలో లైబ్రేరియన్ ఉన్నాడా లేడా అన్నది ఒక ప్రశ్నార్థకంగా మారింది. గిరిజన ప్రాంతం కావడంతో అధికారులు ఆడింది ఆట పాడింది పాటగా సాగుతుంది. ఇప్పటికైనా దీనిపై జిల్లా కలెక్టర్ దృష్టి పెట్టాలని విద్యార్థులు వేడుకుంటున్నారు.