ఈనెల 15, 16 తేదీల్లో స్పాట్ అడ్మిషన్
NEWS Sep 12,2025 05:19 pm
తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ గురుకుల (బాలుర) డిగ్రీ కళాశాల మణుగూరు/మిట్టగూడెంలో డిగ్రీ ప్రథమ సంవత్సరం నందు చేరుటకు ఈనెల 15,16 తేదీలలో స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ నిర్వహించ బడునని మిట్టగూడెం గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రవి బండారుపల్లి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన విద్యార్థులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన లేదా తత్సమాన అర్హత కలిగిన గిరిజన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా కళాశాలలో సమర్పించి అడ్మిషన్ పొందగలరని ఆయన అన్నారు.