పాము కాటు నుండి ప్రాణాపాయం తప్పింది
NEWS Sep 12,2025 10:34 pm
కడెం మండలం మద్దిపడగ గ్రామానికి చెందిన దేవక్కకు పాము కాటు వేయడంతో ఆమెను అత్యవసరంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ రమేష్ రెడ్డి ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వేగంగా స్పందించి కేవలం ఒకే రోజులో 30 ASV ఇంజెక్షన్లు అందించి ఆమె ప్రాణాలను రక్షించారు. దేవక్క క్షేమంగా కోలుకోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు డాక్టర్ రమేష్ రెడ్డి మరియు ఆసుపత్రి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.