ఆక్వా రైతులను ఆదుకుంటాం
NEWS Sep 12,2025 01:37 pm
అమెరికా సుంకాల విధింపు కారణంగా కొంత మేరకు ఆక్వా రైతులకు ఇబ్బంది తలెత్తిందని , కేంద్రం ఆదుకుంటుందని అన్నారు బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్. సారథ్యం పేరుతో ఆయన చేపట్టిన జిల్లాల పర్యటనలో భాగంగా భీమవరంలో చాయ్ పే చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు ఎంపీ పాకా సత్య నారాయణ హాజరయ్యారు. స్థానికులు పలు సమస్యలను తమ దృష్టికి తీసుకు వచ్చారని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు మాధవ్.