దసరా ఉత్సవాల కోసం సౌకర్యాలు కల్పించాలి
NEWS Sep 12,2025 10:33 pm
జగిత్యాల: టీఆర్ నగర్‌కు చెందిన నవదుర్గ దేవి ఉత్సవాల నిర్వాహకులు మున్సిపల్ కమిషనర్‌కి వినతి పత్రం అందజేశారు. రాబోయే దసరా, దుర్గా దేవి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మోహన్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.