పల్లెల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం
NEWS Sep 12,2025 10:30 pm
కేంద్ర ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోవడంతో పల్లెల్లో పారిశుద్ధ్య పనులు పూర్తిగా ఆగిపోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 1216 గ్రామాల్లో మురుగు కాలువల శుభ్రత, విద్యుద్దీపాల నిర్వహణ సమస్యాత్మకంగా మారింది. మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఫాగింగ్ మషీన్లు ఉన్నప్పటికీ వినియోగం లేకుండా నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఈ పరిస్థితిలో డెంగ్యూ, టైఫాయిడ్, వైరల్ జ్వరాలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి నిధులు విడుదల చేసి పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.