16 నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్
NEWS Sep 12,2025 10:15 am
తెలంగాణలో MBBS, BDS అడ్మిషన్ల కౌన్సెలింగ్ సెప్టెంబర్16న ప్రారంభమవుతుందని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది. జనరల్ మెరిట్ జాబితా 15న వెల్లడిస్తామని పేర్కొంది. ఆ తర్వాత మొదటి దశ కౌన్సెలింగ్ జరుగుతుందని తెలిపింది. విద్యార్థులు సెప్టెంబర్ 17 నుండి 19 వరకు వెబ్ ఆప్షన్లు వేసుకోవచ్చని పేర్కొంది. కేటాయించిన సీట్లు 20వ తేదీ నుంచి 24 వరకు ఆయా మెడికల్ కాలేజీలలో రిపోర్టు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. రెండవ దశ 26 నుండి 28 వరకు జరుగుతుందని పేర్కొంది. అన్ని రౌండ్‌లతో సహా కౌన్సెలింగ్ ప్రక్రియ 30 నాటికి పూర్తవుతుందని వీసీ నందకుమార్ రెడ్డి తెలిపారు.